: మిర్చి సాస్ లో స్నానం చేసిన ఘనుడు!
మిరపకాయలు తరిగిన చేతులు పొరపాటున ముఖానికో లేక ఇతర శరీరభాగాలకో తగిలితే మంటెత్తిపోయి.. కొంచెం సేపు దిమ్మతిరిగి పోతుంది. అలాంటిది, 1,250 బాటిళ్ల సాస్ ను బాత్ టబ్ లో కుమ్మరించి, అందులో పండు మిరపకాయలు వేసి మరీ స్నానానికి దిగితే ఎలా ఉంటుందంటే, సెమిరీ కాండర్ అనుభవంలా ఉంటుంది. చాక్లెట్, ఓరియో, బీర్ లు.. మొదలైన వాటితో వినూత్న స్నానాలు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్న సెమిరీ కాండర్ తాజాగా సాస్ లో పండు మిరపకాయలు వేసుకుని స్నానం చేశాడు. ఈ వీడియోను యూట్యూట్ లో కూడా పోస్ట్ చేశాడు. ఈ నెల 2వ తేదీన ఈ వీడియోను యూట్యూబ్ లో సెమిరీ కాండర్ అప్ లోడ్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటివరకు సుమారు 2.4 కోట్ల మందికి పైగా వీక్షించారు. కాగా, సాస్ లో మునిగి తేలిన సెమిరీ ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. మిరపకాయల మంటకు దిమ్మ తిరిగిపోవడంతో కేకలు పెట్టడం ఆ వీడియోలో మనకు వినపడుతుంది.