: కేసులకు భయపడం, కేసీఆర్ తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలి: గండ్ర వెంకటరమణారెడ్డి
మహారాష్ట్రతో పలు ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని బేగంపేటలో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీనేతలపై చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలని అన్నారు. తాము కేసులకు భయపడబోమని పేర్కొన్నారు. కేసీఆర్ అసత్యాలు పలకడం మానుకోవాలని అన్నారు. తెలంగాణ వద్దు.. ప్యాకేజీ ముద్దు అని కాంగ్రెస్ నేతలెన్నడూ వ్యాఖ్యానించలేదని ఆయన చెప్పారు.