: ఇటలీలో భూకంప శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన ఎనిమిదేళ్ల చిన్నారి!
ఇటలీలో సంభవించిన భూకంపం ఆ దేశంలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన అమట్రీస్ నగరంలో శిథిలాల్లో చిక్కుకున్న ఓ ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడింది. శిథిలాలు తొలగిస్తుండగా ఆ చిన్నారి కాళ్లను గమనించిన సిబ్బంది శిథిలాలను పూర్తిగా తొలగించారు. తనను బయటకు తీయగానే ఆ చిన్నారి రెస్క్యూ టీమ్‌లోని వ్యక్తిని హత్తుకుంది. చిన్నారి ప్రాణాలతో బయటపడడం పట్ల అక్కడివారు హర్షం వ్యక్తం చేశారు. ఆ చిన్నారి పేరు జూలియా అని అధికారులు తెలిపారు. చిన్నారి వేసుకున్న దుస్తులు మొత్తం దుమ్ముతో నిండిపోయి కనిపించాయి.