: పుష్కర స్నానం చేసిన పాప ఫోటోల్లో మూడు చేతులు, కృష్ణమ్మ మహాత్మ్యమే అంటున్న భక్తులు... మీరూ చూడండి!
మహబూబ్ నగర్ లోని సోమశిల పుష్కర ఘాట్ లో చివరి రోజు పుణ్య స్నానాల సందర్భంగా ఓ వింత జరిగింది. తన తండ్రితో కలసి ఓ పాప పుష్కర స్నానానికి వెళ్లగా, వారి బంధువులు కొన్ని ఫోటోలు తీశారు. వాటిల్లో ఒకదానిలో పాపకు మూడు చేతులు ఉన్నట్టు కనిపిస్తోంది. కృష్ణయ్య అనే యాత్రికుడు తన కుమార్తె, 11 నెలల ప్రయోగకు స్నానం చేయిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. ఈ వింత చిత్రాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతుండగా, అదిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కృష్ణమ్మ మహాత్మ్యం కారణంగానే ఇలా జరిగిందని భక్తులు చర్చించుకుంటున్నారు.