: భద్రాచలం సీతారామస్వామి ‘న‌గ‌ల మాయం కేసు’లో మూడో రోజూ నగలు లెక్కించినా కొలిక్కిరాని దర్యాప్తు ప్రక్రియ


భ‌ద్రాచ‌లం శ్రీ సీతారామస్వామి ఆల‌య‌ చరిత్రలో తొలిసారి బంగారు నగలు మాయం అయిన కేసును న‌మోదు చేసుకున్న పోలీసులు ముమ్మ‌రంగా ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. సీతమ్మవారి మంగళ సూత్రాలే కనిపించకుండా పోవడం ప‌ట్ల భ‌క్తులు తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తున్నారు. ఆలయ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా జరిగిన ఈ ఘటనపై మూడో రోజూ నగలు లెక్కించినా ద‌ర్యాప్తు ప‌క్రియ‌ కొలిక్కిరాలేదు. నిర్లక్ష్యం వ‌ల్ల పోయాయా? లేదంటే చేతివాటం ప్ర‌ద‌ర్శించారా? అనే అంశంపై పోలీసులు అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇద్ద‌రు ప్ర‌ధాన అర్చ‌కులు, ఉప అర్చ‌కుడితో పాటు మ‌రో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News