: వినోద్ రాయల్ ఇంటికి చేరుకున్న పవన్ క‌ల్యాణ్‌... క‌న్నీటి ప‌ర్యంతమైన అభిమాని త‌ల్లి


సినీన‌టుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలోని ఆయ‌న అభిమాని వినోద్ రాయ‌ల్‌ ఇంటికి చేరుకున్నారు. తిరుప‌తి ఎయిర్‌పోర్టు నుంచి భారీ బందోబ‌స్తు మ‌ధ్య ఆయన వినోద్ ఇంటికి వచ్చారు. ఓ తెలుగు హీరో అభిమానుల చేతిలో ప‌వ‌న్ ఫ్యాన్‌ వినోద్ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. వినోద్ త‌ల్లిని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రామ‌ర్శిస్తున్నారు. ప‌వ‌న్‌ని చూడ‌గానే ఆమె క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. తనయుడి గురించి ప‌లు విష‌యాలు చెబుతూ ఆమె ఉద్వేగానికి లోనైంది. వినోద్ మృతి ప‌ట్ల ప‌వ‌న్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. కాగా, వినోద్ ఇంటి పెద్ద ఎత్తున పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. మ‌రికాసేప‌ట్లో ప‌వ‌న్ మీడియాతో మాట్లాడ‌నున్న‌ట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News