: తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో 'ఫ్రీ ఆఫర్' పనిచేసే ప్రాంతాలివే!
మూడు నెలల పాటు అపరిమిత 4జీ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ అందిస్తూ, రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, 4జీ సిగ్నల్స్ అందే ప్రాంతాలు మాత్రం కొన్నే ఉన్నాయి. చాలా చోట్ల టవర్ల నుంచి వీఓఎల్టీఈ తరంగాలను అందించేందుకు సరైన సాంకేతిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జియో ఫ్రీ ఆఫర్ కచ్చితంగా పనిచేసే పట్టణాల వివరాలివి. ఏపీలో అమలాపురం, అనంతపురం, భీమవరం, చిత్తూరు, కడప, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లె, నంద్యాల, నరసాపురం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పాలకొల్లు, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం పట్టణాలు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, అదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, పాల్వంచ, సిద్దిపేట, వరంగల్ పట్టణాలు. ఇక దేశంలో 4జీ సిగ్నల్స్ ఏఏ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయన్న విషయమై 'జియో' అధికారిక వెబ్ సైట్లో వివరాలు ఇచ్చారు.