: విమాన ప్రయాణికులకు పది రోజుల్లో తీపి కబురు.. విమానాల్లోనూ వైఫై సేవలు!
విమాన ప్రయాణికులకు ఇది నిజంగా తీపి కబురే. మరికొన్ని రోజుల్లో విమానాల్లో వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. భారత గగనతలం మీద ప్రయాణించే వారు ఇక నుంచి ఎంచక్కా మొబైల్ ఫోన్స్ వాడుకోవచ్చు. వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘‘పది రోజుల్లో మీకో మంచి కబురు చెబుతా’’ అని పౌరవిమానయాన కార్యదర్శి ఆర్ఎన్ చౌబే పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం విమాన ప్రయాణికులు భారత గగనతలంపై ప్రయాణిస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు, ఇంటర్‌నెట్ వాడకాన్ని అనుమతించని విషయం తెలిసిందే.