: టంగుటూరు వద్ద బోల్తా పడ్డ ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు!... మితి మీరిన వేగమే కారణమట!
ఖమ్మం జిల్లా కూసుమంచిలో మొన్న జరిగిన యాత్రా జీని బస్సు ప్రమాదాన్ని మరువక ముందే ఆ తరహా ప్రమాదమే నేటి తెల్లవారుజామున ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు. బెంగళూరు నుంచి విజయవాడ బయలుదేరిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు టంగుటూరు వద్ద వేగంగా దూసుకువచ్చి అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. మితి మీరిన వేగం కారణంగానే ఈ బస్సు ప్రమాదం చోటుచేసుకుందని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.