: హత్యకు గురైన అభిమాని కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్ కల్యాణ్


కర్ణాటకలోని కోలార్‌ లో హత్యకు గురైన తన అభిమాని వినోద్‌ కుటుంబాన్ని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ రేపు పరామర్శించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య రాజుకున్న విభేదాల కారణంగా తిరుపతికి చెందిన వినోద్‌ కోలార్ లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్, హతుడి కుటుంబ సభ్యులను పరామర్శించాలని నిర్ణయించారు. ఈ ఘటనలో నిందితుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అక్షయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News