: బెనారస్ వర్సిటీలో మగ విద్యార్థిపై అఘాయిత్యం!
ప్రతిష్ఠాత్మక బెనారస్ యూనివర్సిటీలో మగ విద్యార్థి అత్యాచారానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వారణాసిలోని లంక పోలీస్ స్టేషన్ లో వారం రోజు క్రితం దీనిపై కేసు నమోదైంది. ఎంఏ హిందీ ప్రధమ సంవత్సరం (19) చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన ఘటనపై వీసీ గిరీష్ చంద్ర త్రిపాఠీ మౌనం వహిస్తుండగా, ఈ కేసులో దర్యాప్తు నత్తనడకన సాగుతోందని యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. బాధితుడిపై లైంగిక దాడి జరిగినట్టు వైద్యులు కూడా ధ్రువీకరించారని వారు చెబుతున్నారు. దీనిపై బాధిత విద్యార్థి సోదరుడు మాట్లాడుతూ, ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కలలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంటుందని తాము ఊహించలేదని, న్యాయం జరిగేవరకు పోరాడుతామని ఆయన తెలిపారు.