: ఈ మహిళ వైద్య శాస్త్రంలోనే అద్భుతం!


పద్దెనిమిది సంవత్సరాలుగా కేవలం బ్లాక్ టీ తాగి బతుకుతూ, ఆరోగ్యంగా ఉన్న ఒక మహిళ వైద్య శాస్త్రంలోనే అద్భుతంగా నిలిచింది. ఛత్తీస్ గఢ్ లోని కొరియా జిల్లాకు చెందిన పీలిబాయి వయస్సు 48 సంవత్సరాలు. ఆమెకు ముప్ఫై ఏళ్లున్నప్పుడు, అంటే, పద్దెనిమిదేళ్ల క్రితం తన చదువు కోసం పాట్నాకు వెళ్లింది. అంతే, అప్పటినుంచి తిండి తినడం మానేసింది. కేవలం బ్లాక్ టీ మాత్రమే తాగేది. రోజుకు రెండు పూట్ల ఈ టీనే తాగి జీవించేంది. దీంతో, పీలిబాయిని ఆమె కుటుంబ సభ్యులు వైద్యుల వద్దకు తీసుకువెళ్లి చూపించారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు ఎటువంటి సమస్య లేదని, చాలా ఆరోగ్యంగా ఉందని చెప్పారు. పద్దెనిమిదేళ్లుగా ఎటువంటి ఆహారం తీసుకోకపోయినప్పటికీ పీలిబాయి ఆరోగ్యంగా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన వైద్యులు, వైద్యశాస్త్రంలోనే ఇది అద్భుతమన్నారు. 1995లో పీలిబాయికి వివాహమైంది. పద్దెనిమిదేళ్లుగా ఆహారం తినకుండా జీవిస్తున్న ఆమెకు అత్తింటి నుంచి మాత్రం ఇబ్బందులు తప్పలేదు. కేవలం ఒకే ఒక్క రోజుకే ఆమెను పుట్టింటికి పంపివేశారు.

  • Loading...

More Telugu News