: సింధు, సాక్షి, దీపా కర్మాకర్ లకు నెక్లెస్ లు బహుమతిగా ప్రకటించిన ఎన్ఏసీ జ్యుయలర్స్
రియో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారిణులకు చెన్నయ్ కి చెందిన ఎన్ఏసీ జ్యుయలర్స్ విలువైన బంగారు నగలు బహుమతిగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రజతపతకం సాధించిన పీవీ సింధుకు ఆరు లక్షల రూపాయల విలువైన బంగారు నెక్లెస్ ను, కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్ కు 3 లక్షల విలువ చేసే రవ్వల నెక్లెస్ ను, చిన్న పొరపాటుతో పతకం కోల్పోయిన దీపా కర్మాకర్ కు లక్ష రూపాయల విలువ చేసే నెక్లెస్ ను అందజేయనున్నట్టు ఎన్ఏసీ జ్యుయలర్స్ ప్రకటించింది. త్వరలోనే వారికి ఈ బహుమతులు అందజేస్తామని తెలిపింది.