: ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనాన్ని ఈసారి ముందుగానే నిర్వహిస్తాం: జీహెచ్ఎంసీ కమిషనర్


ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనాన్ని ఈసారి ముందుగానే నిర్వహిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో వినాయకచవితి, బక్రీద్ పండగలపై ఈరోజు సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం చేయాలని నిర్ణయించామన్నారు. దక్షిణ మండల పరిధిలో 15 అడుగుల విగ్రహాలను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, మెట్రో రైలు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ సమావేశంలో సీపీ మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వినాయక నిమజ్జనాలను దృష్టిలో పెట్టుకుని అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలని జీహెచ్ఎంసీకి ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News