: పుల్వామాలో మరోసారి చెలరేగిన ఆందోళనలు.. ఒకరి మృతి
హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారలేదు. ప్రతిరోజు ఎక్కడో చోట అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. పుల్వామాలో ఈరోజు మరోసారి ఆందోళనలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో మోహరించిన భద్రతా బలగాలపై స్థానికులు విరుచుకుపడ్డారు. వారిపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరోవైపు రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు శ్రీనగర్ వెళ్లనున్నారు. కశ్మీర్ పరిస్థితులపై ఆయన చర్చలు జరుపుతారు.