: ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్... పోలీసుల కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి
నిత్యం నిషేధిత మావోయిస్టుల సంచారంతో అల్లకల్లోలంగా మారిన ఛత్తీస్ గఢ్ లో నేటి తెల్లవారుజామున మరోమారు తుపాకులు గర్జించాయి. మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. సుక్మా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఎన్ కౌంటర్ లో ఓ మావోయిస్టు దళ సభ్యుడు మరణించాడు. కాల్పులు సద్దుమణిగిన అనంతరం ఆ ప్రదేశంలో సోదాలు చేసిన పోలీసులు ఓ పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు.