: తండ్రి జ్ఞాపకాలలో ప్రియాంక చోప్రా!
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రా జయంతి నేడు. ఈ సందర్భంగా తన తండ్రి గురించిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. తన ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. ‘కొన్ని విషయాలు ఎంతో బాధను మిగులుస్తాయి. అన్ని బాధలను కాలమే నయం చేయదు.. మిస్ యు పప్పా.. నువ్వుండి ఉంటే ఎంతో సంతోషంగా నీ పుట్టినరోజు వేడుకలు చేసుకునేవాళ్లం.. పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ఆ ట్వీట్ లో పేర్కొంది. తన తండ్రితో పాటు దిగిన ఒక ఫొటోను కూడా ఈ సందర్భంగా పోస్ట్ చేసింది.