: ఢిల్లీలో మూడు కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ!
మూడు కోట్ల రూపాయల విలువైన వజ్రాల హారం ఎత్తుకెళ్లిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని ఆనంద్ లోక్ ప్రాంతంలో ఎయిర్ లైన్స్ కు చెందిన ఎగ్జిక్యూటివ్ అధికారి కుమార్తె నివాసం ఉంటోంది. బంధువుల వివాహం ఉండడంతో గత రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి ఆ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు రాత్రి 9 గంటల సమయంలో వెళ్లారు. వేడుక ముగించుకుని తెల్లవారు జామున 4 గంలకు తిరిగి వచ్చారు. ఇంటి వెనుక భాగంలో పనిమనుషులు నిద్రపోయారు. యజమాని కుటుంబ సభ్యులు త్వరగా వచ్చేస్తారని వారు గేట్ ను లాక్ చేయలేదు. కిటికీలు కూడా మూయలేదు. దీనిని అవకాశంగా తీసుకున్న దొంగలు కిటికీల నుంచి లోపలికి చొరబడి, ఓ అల్మారా పగులకొట్టి 3 కోట్ల విలువైన వజ్రాల హారం, 60 వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేర కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.