: ఖతర్ షిప్పింగ్ కంపెనీకి వంద కోట్ల జరిమానా విధించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్
నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) రెండు సంస్థలకు భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2011 లో ముంబయి సముద్ర తీరంలో ఆయిల్ ఒలికిన కేసును సుదీర్ఘంగా విచారించిన ఎన్‌జీటీ చివరకు దానికి కారణమైన సంస్థలపై భారీ జరిమానా విధించింది. ఖతర్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీని దోషిగా తేల్చిన ఎన్‌జీటీ దానికి వంద కోట్ల రూపాయల జరిమానా వేసింది. దానితో పాటు అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు రూ.5 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది.