: మంత్రి అచ్చెన్నాయుడిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా... సాక్ష్యాలు కావాలంటే టీవీ9లో చర్చకు సిద్ధం: నట్టి కుమార్


నయీం అరాచకాలు, ఆంధ్రప్రదేశ్ లో నేతల సంబంధాలపై మంత్రి అచ్చెన్నాయుడికి తెలిపానని నట్టి కుమార్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఇంతకు క్రితమే సదరు మంత్రి ఖండించారు. నట్టి కుమార్ ఎవరో తనకు తెలియదని కూడా ఆయన అన్నారు. వీటిపై నట్టి కుమార్ మాట్లాడుతూ, అచ్చెన్నాయుడిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. దీనిపై బహిరంగ చర్చకైనా, టీవీ9 వేదికగా చర్చకైనా తాను సిద్ధమని ప్రకటించారు. మంత్రిని కలిసి, నయీం గురించి చెప్పి, హెచ్చరించానని చెప్పేందుకు తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని ఆయన తెలిపారు. తాను మీడియాతో మాట్లాడిన తరువాత సినీ పరిశ్రమలో ఎంతో మంది నయీం బాధితులు తనతో ఫోన్ లో మాట్లాడారని ఆయన చెప్పారు. తన దగ్గర ఉన్న ఆధారాలు సిట్ కు అందజేస్తానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News