: ఏపీలో నూతన రైల్వే మార్గాన్ని విజయవాడ నుంచి రిమోట్ ద్వారా ప్రారంభించిన సురేశ్ ప్రభు
ఎర్రగుంట్ల-నంద్యాల మధ్య నూతన రైల్వే మార్గాన్ని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఈరోజు విజయవాడ నుంచి రిమోట్ ద్వారా ప్రారంభించారు. నంద్యాల-కడప డెమూ రైలును కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు సురేశ్ ప్రభు, వెంకయ్యనాయుడు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ప్రభు మాట్లాడుతూ.. రైలు మార్గం ద్వారా కొత్త రాజధాని నగరం అమరావతితో రాయలసీమను కలుపుతున్నామని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సాయం అందిస్తామని అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.