: నేను ప్రతిరోజు ఉదయం బ్యాడ్మింటన్ ఆడుతా: వెంకయ్యనాయుడు
శారీరక శ్రమ అందరి జీవితంలో భాగం కావాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈరోజు విజయవాడలో పర్యటిస్తోన్న బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్స్ రజత పతక విజేత పి.వి సింధుని, ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్‌ని వెంకయ్య విజయవాడ క్లబ్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వారిరువురికీ అభినందనలు తెలిపారు. ప్రతిరోజు ఉదయం తాను కూడా బ్యాడ్మింటన్ ఆడుతానని వెంకయ్య పేర్కొన్నారు. శారీరక శ్రమ లేకపోతే మనస్సులో ఉత్సాహం ఉండదని వెంకయ్య అన్నారు. శారీరక శ్రమతోనే మానసిక ఆరోగ్యం లభిస్తుందని ఆయన చెప్పారు. క్రీడల ద్వారా శారీరక శ్రమ కలుగుతుందని పేర్కొన్నారు. ఈ వయసులోనూ తాను ఇంత ఉత్సాహంగా ఉన్నానంటే తాను చేస్తోన్న శారీరక శ్రమే కారణమని ఆయన చెప్పారు. దేశంలో క్రీడలని మరింత ప్రోత్సాహించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.