: గుజరాత్ అసెంబ్లీలోనూ సస్పెన్షన్ల పర్వం!... 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల బహిష్కరణ!
దేశంలోని చట్టసభల్లో విపక్ష సభ్యులపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తొలుత తెలంగాణ, ఆ తర్వాత ఏపీ, మొన్నటికి మొన్న తమిళనాడు... తాజాగా గుజరాత్ అసెంబ్లీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఉనా దళితుల ఘటనను గుజరాత్ అసెంబ్లీలో ఆ రాష్ట్రంలోని విపక్షం కాంగ్రెస్ ప్రస్తావించింది. కొద్దిసేపటి క్రితం ఈ అంశంపై గళం విప్పిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాధితులకు న్యాయం చేయడంతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ కు ప్రభుత్వం స్పందించాలని వారు సభలోనే ఆందోళనకు దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ మొత్తం 44 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు.