: ఆ అదృష్టం మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే ఉంది : అల్లు అర్జున్
ప్రపంచంలో ఎంతో పెద్ద హీరోలు ఉండొచ్చు కానీ, ఏ హీరోకి ఇంత పెద్ద రేంజ్ లో ఫంక్షన్ చేసే ఫ్యాన్స్ ఉండరని, ఆ అదృష్టం కేవలం మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే ఉందని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నాడు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ, గత ఏడాది చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నప్పటి నుంచి ఇప్పటివరకు తన మైండ్ లో ఇదే విషయం ఉందని చెప్పాడు. ఈ సందర్భంగా ప్రతి అభిమానికి తన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పాడు. ఈ సందర్భంగా చిరంజీవి 'ముఠా మేస్త్రి' చిత్రంలోని ఒక డైలాగ్ ను అల్లు అర్జున్ చెప్పి ‘మెగా’ అభిమానులను ఆనందింపజేశాడు.