: ‘చిరు’ బర్త్ డే వేడుకలకు హాజరైన ‘అల్లు‘, ‘మెగా’ కుటుంబాల హీరోలు


హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు చిరంజీవి సోదరుడు, ప్రముఖ నటుడు నాగబాబు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.‘అల్లు’, ‘మెగా’ కుటుంబాలకు చెందిన యువహీరోలు రాంచరణ్, అర్జున్, శిరీష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ హాజరయ్యారు. హీరోయిన్లు రాశిఖన్నా, రకుల్ ప్రీతి సింగ్ కూడా విచ్చేయగా, చిరంజీవి చిత్రాల్లోని పాటలకు అభిమానులు ఆడిపాడుతున్నారు. ప్రముఖ గాయకుడు సింహా మెగాస్టార్ చిత్రాల్లోని పాటలు పాడుతూ చిరు అభిమానులను మరింత ఉత్సాహపరుస్తున్నారు.

  • Loading...

More Telugu News