: ఒక సెలబ్రిటీగా ఒకే మహిళతో కలిసి ఉండటం కష్టం: ఉసేన్ బోల్ట్
బ్రెజిల్ అమ్మాయి జాడీ డ్యురేట్ (20)తో రాసలీలలు సాగించిన జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఈ విషయమై స్పందించాడు. ఒక సెలబ్రిటీగా ఒకే మహిళతో కలిసి ఉండటం చాలా కష్టమని అన్నాడు. ఈ విషయాన్ని తాను చాలా తేలికగా తీసుకుంటున్నానని, జమైకా సంస్కృతి విభిన్నంగా ఉంటుందని చెప్పాడు. మహిళలతో పోలిస్తే పురుషులకు ఒకరి కంటే ఎక్కువ మంది భాగస్వాములుంటారని బోల్ట్ చెప్పు కొచ్చాడు. కాగా, బోల్ట్ విషయమై ఆయన సోదరి మాట్లాడుతూ, జమైకాకు చెందిన కాసి బెనెట్ తో బోల్ట్ డేటింగ్ చేస్తున్నాడని చెప్పారు. రెండేళ్లుగా ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని, ఆ అమ్మాయినే తన సోదరుడు వివాహం చేసుకుంటాడని చెప్పింది.