: నార్సింగిలో అస్థిపంజ‌రం వెలికితీత‌.. న‌యీమ్ చంపిన 17 ఏళ్ల అమ్మాయిదేన‌ని అనుమానం


హైద‌రాబాద్ శివారు నార్సింగిలోని మంచిరేవుల‌ మూసీ ప‌రీవాహ‌క ప్రాంతంలో ఈరోజు పోలీసులు ఓ అస్థిపంజ‌రాన్ని వెలికితీశారు. తన ఇంట్లో ప‌నిచేసిన 17 ఏళ్ల అమ్మాయిని మూడేళ్ల క్రితం న‌యీమ్ దారుణంగా చంపేశాడు. తాజాగా దొరికిన అస్థిపంజ‌రం ఆ అమ్మాయిదే అయివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సిట్ అధికారుల స‌మాచారంతో పోలీసులు అస్థిపంజ‌రాన్ని గుర్తించారు. అస్థిపంజ‌రం ఎవ‌రిద‌నే విష‌యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు 33 మంది న‌యీమ్ అనుచ‌రులను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం రూ.143 కోట్ల విలువైన ఆస్తుల‌ను అధికారులు సీజ్ చేశారు. మరో మూడు రోజుల్లో ప్రాథమిక దర్యాప్తు పూర్తి కానుంది.

  • Loading...

More Telugu News