: సింధునే మా రోల్‌మోడ‌ల్.. ఆమెలా కావాల‌నుకుంటున్నాం: గ‌చ్చిబౌలి స్టేడియంలో చిన్నారులు


మరికాసేపట్లో బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి సింధు హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియానికి చేరుకోనుంది. సింధుని అక్క‌డ ఘ‌నంగా స‌న్మానించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు స్కూళ్ల నుంచి విద్యార్థులు స్టేడియానికి భారీగా చేరుకున్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. సింధునే త‌మ‌ రోల్‌మోడ‌లని.. ఆమెలా తాము ఎదగాలనుకుంటున్నామ‌ని తెలిపారు. బ్యాడ్మింట‌న్ అంటే త‌మ‌కు చాలా ఇష్ట‌మ‌ని చిన్నారులు పేర్కొన్నారు. త‌మకెంతో ఇష్ట‌మ‌యిన క్రీడాకారిణి పి.వి సింధు అని అన్నారు. తాము సింధుని స్ఫూర్తిగా తీసుకొని తమ‌కు ఇష్ట‌మైన ఆట‌లో రాణించాల‌నుకుంటున్నట్లు చెప్పారు. తాము కూడా అంతర్జాతీయంగా క్రీడల్లో రాణిస్తామని అన్నారు. సింధు.. సింధు అంటూ నినాదాలు చేస్తూ స్టేడియంలో చిన్నారులు ఉత్సాహంగా క‌నిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News