: ఉర్జిత్ పటేల్ కు స్వాగతం పలకని మార్కెట్లు... 8,650 దిగువకు నిఫ్టీ


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా అనుభవజ్ఞుడైన ఆర్థిక విశ్లేషకుడు, డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను నియమించారన్న వార్తలు మార్కెట్ వర్గాలకు పెద్దగా సంతృప్తిని ఇచ్చినట్టు కనిపించలేదు. రూపాయిని స్థిరీకరించి, ద్రవ్యోల్బణం పరుగును ఆపిన రఘురాం రాజన్ వారసుడిగా, దాదాపు ఆయనకున్నంత అనుభవమున్న ఉర్జిత్ రాకను స్టాక్ మార్కెట్ స్వాగతించలేదు. ఉర్జిత్ నియామకాన్ని శనివారం నాడు ఖరారు చేయగా, నేటి సెషన్లో నిఫ్టీ సూచిక కీలకమైన 8,650 పాయింట్ల స్థాయి వద్ద కొనుగోలు మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమైంది. ఉదయం 10:45 గంటల ప్రాంతానికి బీఎస్ఈ సూచి క్రితం ముగింపుతో పోలిస్తే 128 పాయింట్లు నష్టపోయి 27,949 పాయింట్లకు, ఎన్ఎస్ఈ సూచి 44 పాయింట్లు పడిపోయి 8,624 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లో 12 కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, బీపీసీఎల్ తదితర కంపెనీలు లాభపడగా, హిందాల్కో, బ్యాంక్ ఆఫ్ బరోడా, లుపిన్, సన్ ఫార్మా, అల్ట్రా సిమెంట్స్ తదితర కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి.

  • Loading...

More Telugu News