: ఒలింపిక్స్ పతకాల ఫైనల్ ట్యాలీ ఇదే
రియోలో ముగిసిన ఒలింపిక్స్ - 2016లో ముందుగా ఊహించినట్టుగానే అగ్రరాజ్యం అమెరికా ముందు నిలిచింది. 46 స్వర్ణాలు, 37 రజతాలు, 38 కాంస్య పతకాలతో మొత్తం 121 పతకాలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తున నిలిచింది. సంప్రదాయంగా రెండో స్థానంలో నిలిచే చైనాను కిందకు నెట్టిన బ్రిటన్ 27 స్వర్ణాలు, 23 రజతాలు, 17 కాంస్య పతకాలతో మొత్తం 67 పతకాలను బ్రిటన్ సాధించగా; 26 స్వర్ణాలు, 18 రజతాలు, 26 కాంస్య పతకాలతో మొత్తం 70 పతకాలతో చైనా మూడవ స్థానంలో నిలిచింది. ఆపై రష్యా 56 పతకాలతో (19 స్వర్ణాలు, 18 రజతాలు, 19 కాంస్యం) నాలుగు, జర్మనీ (17 స్వర్ణాలు, 10 రజతాలు, 15 కాంస్యం) 42 పతకాలతో 5వ స్థానంలో నిలిచాయి. ఆరవ స్థానంలో జపాన్ (12 స్వర్ణాలు, 8 రజతాలు, 14 కాంస్యం) నిలువగా, ఆపై ఫ్రాన్స్ (10 స్వర్ణాలు, 18 రజతాలు, 14 కాంస్యం), సౌత్ కొరియా (9 స్వర్ణాలు, 3 రజతాలు, 9 కాంస్యం), ఇటలీ (8 స్వర్ణాలు, 12 రజతాలు, 8 కాంస్యం), ఆస్ట్రేలియా (8 స్వర్ణాలు, 11 రజతాలు, 10 కాంస్యం) పతకాలు సాధించాయి. నెదర్లాండ్స్ కు 8 స్వర్ణాలు సహా 19, హంగేరీకి 8 స్వర్ణాలు సహా 15, బ్రెజిల్ కు 7 స్వర్ణాలు సహా 19, స్పెయిన్ కు 7 స్వర్ణాలు సహా 17, కెన్యాకు 6 స్వర్ణాలు సహా 13, జమైకాకు 6 స్వర్ణాలు సహా 11, క్రొయేషియాకు 5 స్వర్ణాలు సహా 10, క్యూబాకు 5 స్వర్ణాలు సహా 11 పతకాలు లభించాయి. ఇండియా ఒక రజతం, ఒక కాంస్య పతకంతో మంగోలియాతో కలిసి 67వ స్థానాన్ని పంచుకుంది.