: ఏపీకి ప్రత్యేకహోదా రావడం వాళ్లిద్దరికీ ఇష్టం లేదు: రఘువీరారెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా రావడం సీఎం చంద్రబాబుకి, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి ఇష్టం లేదని ఏపీసీసీ చీఫ్, సీనియర్ నేత రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈరోజు అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకని ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీపడ్డారని, కోట్ల రూపాయలకు ఆశపడే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అడుగుతున్నారని రఘువీరా ఆరోపించారు.