: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరిన ముంబై వ్యాపారవేత్త కుటుంబ సభ్యులు!


ఇదో షాకింగ్ వార్త. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త కుటుంబంలోని ఐదుగురు పశ్చిమాసియా దేశాలకు వెళ్లి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరారన్న వార్త కలకలం రేపుతోంది. ముంబై కేంద్రంగా పలు రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్న అబ్దుల్ మాజిద్ కుమారుడు అష్ఫాక్ అహ్మద్ తన బార్య, కుమారుడు, మరో ఇద్దరు కజిన్స్ ను తీసుకుని ఉగ్రవాదుల్లో చేరిపోయాడని పోలీసులు తేల్చారు. 26 సంవత్సరాల అహ్మద్, నెలల వయసున్న కుమార్తె, భార్యలతో పాటు కజిన్స్ మహమ్మద్ సిరాజ్, ఇజాజ్ రెహమాన్ లతో కలసి గత నెలలో దేశాన్ని విడిచి పోయాడని, ఆపై తాను ఐఎస్ రాజ్యానికి చేరినట్టు తమ్ముడికి మెసేజ్ పెట్టాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇకపై వెనక్కు రాబోమని, తల్లిని, తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని మెసేజ్ చేయగా, అబ్దుల్ మాజిద్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరందరూ ముస్లిం ప్రచారకుడు మహమ్మద్ హనీఫ్ మాటలతో ఉగ్రవాదంవైపు ప్రభావితులయ్యారన్న అనుమానంతో ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News