: టర్కీలో పెళ్లి వేడుకపై బాంబుదాడి.. 22 మంది దుర్మరణం


టర్కీ మరోమారు బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఆగ్నేయ టర్కీలోని గజియంటెప్‌లో ఓ పెళ్లి వేడుకపై ఉగ్రవాదులు బాంబు దాడికి దిగారు. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా 94 మంది గాయపడ్డారు. చూస్తుంటే ఇది ఆత్మాహుతి దాడి పనిలా ఉందని డిప్యూటీ ప్రధాని మెహ్మట్ సిమ్సెక్ తెలిపారు. ఇది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పనా? లేక కుర్దిష్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారా? అనే విషయం తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. సిటీలో మరికొన్ని చోట్ల కూడా బాంబు పేలుళ్ల శబ్దం వినిపించినట్టు స్థానిక జర్నలిస్టు ఒకరు తెలిపారు. కాగా ఈ జూన్‌లో ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 44 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News