: బ్యాడ్మింటన్ స్టార్ సింధుతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో గర్వంగా పోస్ట్ చేసిన సల్మాన్ ఖాన్!
భారత్ జనాభా 130 కోట్లను దాటేస్తోంది. అయినా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు తీసుకొచ్చే క్రీడాకారులే కరవయిపోయారు. ఈ నేపథ్యంలో భారత్‌కు రజత పతకం తీసుకొచ్చిన బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పి.వి సింధు సెలబ్రిటీలకే సెలబ్రిటీగా మారిపోయింది. దేశంలో ఏ రంగంలోని ప్రముఖ వ్యక్తులయినా అంతా సింధు నామస్మరణ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఆయన అభిమానులు ఫోటోలు దిగి ఎంతగానో మురిసిపోతూ వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసే దృశ్యాలే మనం ఇంతవరకు చూశాం. అయితే ఈసారి సల్మాన్ ఖానే సింధుతో దిగిన ఫోటోను సోషల్‌మీడియాలో గర్వంగా పోస్ట్ చేశాడు. నిన్న జరిగిన పి.వి.సింధు ఫైనల్ పోరాటాన్ని సల్మాన్ తన తల్లితో కలిసి చూశాడట. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన సింధుతో గతంలో దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. టీవీలో కనిపిస్తోన్న సింధుతో తాను గతంలో ఫొటో దిగినట్లు తన తల్లితో సల్మాన్ ఎంతో గర్వంగా చెప్పాడట.