: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మరింత వేగవంతం.. కేసీఆర్ అధ్యక్షతన కాసేపట్లో అఖిలపక్ష సమావేశం
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుది అంకానికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు, మంత్రులతో కొత్త జిల్లాల ఏర్పాట్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివేదికలు తెప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కేసీఆర్ అధ్యక్షతన కాసేపట్లో అఖిలపక్ష సమావేశం ప్రారంభం కానుంది. సమావేశానికి తెలంగాణలోని ఏడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులు హాజరుకానున్నారు. అఖిలపక్ష సమావేశం అనంతరం మంత్రివర్గ సమావేశం నిర్వహించి కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.