: సింధుకు రివార్డు విషయంలో ఏపీ బాటలోనే తెలంగాణ!... కేబినెట్ భేటీ తర్వాతే నిర్ణయమని కేటీఆర్ ట్వీట్!


రియో ఒలింపిక్స్ లో భారత్ కు రజత పతకాన్ని సాధించిపెట్టిన తెలుగు తేజం పీవీ సింధుకు దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే నజరానాలు ప్రకటించాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటిదాకా నిర్ణయం వెలువడలేదు. నేటి ఉదయం విజయవాడలో భేటీ అయిన ఏపీ కేబినెట్ ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణ సర్కారు కూడా ఏపీ బాటలోనే పయనిస్తోంది. సింధుకు రివార్డు విషయంలో కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. సింధుకు రివార్డు విషయంలో ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదని చెప్పిన ఆయన... సాయంత్రం జరగనున్న కేబినెట్ భేటీ తర్వాత స్వయంగా సీఎం కేసీఆరే ఈ విషయంపై విస్పష్ట ప్రకటన చేస్తారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News