: రెండో సెట్ ను గెలుచుకున్న మారిన్...చేష్టలుడిగిన సింధు!


రెండో సెట్ లో టాప్ సీడ్ ఆటతీరును కెరొలినా మారిన్, సింధుకు రుచిచూపింది. తొలి సెట్ కోల్పోయి డీలా పడాల్సిన స్థానంలో ఆమె చెలరేగిపోయింది. సెట్ ఆద్యంతం షాట్లు, డ్రాప్ లతో విరుచుకుపడింది. ఒక దశలో మారిన్ షాట్లకు సింధు దగ్గర సమాధానం లేకుండా పోయిందంటే అతిశయోక్తి కాదు. నెట్, టైన్, సైడ్ లైన్స్ ఇలా షటిల్ ఎక్కడ పడ్డా మారిన్ దూసుకుపోయింది. నెట్ గేమ్ తో సింధును రెండో సెట్ లో మట్టికరిపించింది. దీంతో రెండో సెట్ 21-12 తేడాతో సింధు ఓటమిపాలైంది. నిర్ణయాత్మక మూడో సెట్ ప్రారంభమైంది.

  • Loading...

More Telugu News