: రాప్తాడు హోటల్ లో మిర్చిబజ్జీలు వేసిన మంత్రి సునీత!
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మిర్చిబజ్జీలు వేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత ఆకస్మిక పర్యటన చేశారు. వేరుశనగ పంటలను పరిశీలించేందుకు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన సునీత రాప్తాడులోని ఓ హోటల్ మీదుగా వెళ్తున్నారు. ఇంతలో ఆ హోటల్ నిర్వహిస్తున్న మహిళ మంత్రిని ఆహ్వానించారు. దీంతో హోటల్ లో వంట చేస్తున్న ఆమె వద్దకు వెళ్లిన మంత్రి తాను కూడా బజ్జీలు వేస్తానంటూ రంగంలోకి దిగి, బజ్జీలు వేశారు. ఇది అక్కడున్న అందర్నీ ఆకట్టుకుంది.