: ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల పెరిగిన ఉష్ణోగ్రతలు.. పుష్కర యాత్రికుల ఇబ్బందులు
ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో విజయవాడలో వేడి వాతావరణం నెలకొంది. దీంతో కృష్ణా పుష్కరాలకు తరలివస్తున్న యాత్రికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రత 37 డిగ్రీలుగా ఉంది. పుష్కరాలు ప్రారంభమైన రోజున అక్కడి ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా ఉంది. వేడి వాతావరణంతో యాత్రికులు చెమటలు కక్కుతున్నారు. పుష్కరాలకు వచ్చే వృద్ధులు, చిన్నారుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందనే చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం వేళ భక్తులు నీడగా ఉండే ప్రాంతాల్లో కనిపిస్తున్నారు.