: తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న పవర్ స్టార్ తనయుడు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ ల కొడుకు అకీరా తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. 2014లో రేణు దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠీ చిత్రంలో అకీరా ఒక పాత్రను పోషించాడు. ఇప్పుడు ఆ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన ఈటీవీ ఛానెల్ లో ఈ డబ్బింగ్ చిత్రం ప్రసారం కానుంది. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. అకీరా ఒక చిన్న పాత్రలో ప్రేక్షకులకు కనపడనున్నాడని ఆ ట్వీట్ లో పేర్కొంది.