: తాగునీటి కోసం కొట్లాట!... గిద్దలూరులో ఇరు వర్గాల ఘర్షణ, పలువురికి గాయాలు!
వేసవి కాలమే రాలేదు. అప్పుడే తెలుగు నేలలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. తాగు నీటి కోసం ఎదురవుతున్న కష్టాల్లో కొట్లాటలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరులో కొద్దిసేపటి క్రితం ఈ తరహా ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పట్టణంలో తాగు నీటి ఎద్దడి కారణంగా మునిసిపాలిటి అధికారులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం పట్టణంలోని ఓ ప్రాంతానికి వచ్చి ఆగిన ట్యాంకర్ వద్ద నీటి కోసం జరిగిన తోపులాటలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో పలువురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అక్కడి స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.