: రాహుల్ తో టీపీసీసీ చీఫ్ భేటీ!... తెలంగాణలో పార్టీ పరిస్థితిని వివరించిన ఉత్తమ్!
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు (టీపీసీసీ చీఫ్) ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. నేటి ఉదయం ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్... నేరుగా రాహుల్ గాంధీ వద్దకు వెళ్లారు. తెలంగాణలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి, పార్టీ కార్యకలాపాలపై ఆయన రాహుల్ గాంధీకి వివరించినట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతున్న క్రమంలోనే ఢిల్లీ నుంచి ఉత్తమ్ కు పిలుపు వచ్చినట్లు సమాచారం.