: ‘ఇన్ఫోసిస్’, ‘విప్రో’లో ఫ్రెషర్ల నియామకాలకు తాత్కాలిక బ్రేక్?


భారత్ లోని ఐటీ దిగ్గజ సంస్థలు ‘ఇన్ఫోసిన్’, ‘విప్రో’లు ఇకపై భారీ స్థాయిలో ఫ్రెషర్లను నియమించుకునే పద్ధతిని తాత్కాలికంగా నిలిపివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత దేశ ఐటీ కంపెనీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎన్నడూ ఎరుగని రీతిలో వృద్ధి రేటు పడిపోవడమే ఇందుకు కారణమని సమాచారం. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ క్వాలిటీ యూనిట్, ప్రభుత్వ సంబంధాల విభాగాధిపతి రంగడోర్ మాట్లాడుతూ, ఫ్రెషర్ల నియామకాల్లో నాణ్యతను పెంచేందుకు మార్గాలపై దృష్టి సారిస్తున్నామని, ఈసారి క్యాంపస్ ఇంటర్వ్యూలు తగ్గుతాయని చెప్పారు. ఇకపై జాబ్ మార్కెట్ కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందని పేర్కొన్నారు. అయితే, బాగా తెలివైన, అత్యుత్తమ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. కాగా, ఫ్రెషర్లు పెద్ద మొత్తాల్లో జీతాలందుకోవడం ఇకపై అంత తేలికకాదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News