: చల్లారని కశ్మీరం... కొనసాగుతున్న అల్లర్లు... సైన్యం కాల్పుల్లో ఒకరి మృతి
భారత సైన్యం చేతిలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ హతమైన అనంతరం కశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లు ఇంకా చల్లారలేదు. కశ్మీర్ లోయలో జనజీవనం స్తంభించింది. అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అల్లర్లకు పాల్పడుతోన్న యువకుల కోసం సోదాలు నిర్వహిస్తోన్న భద్రతా బలగాలపై ఈరోజు పలువురు రాళ్ల వర్షం కురిపించారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుదాడి చేశాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో 18 మందికి గాయాలయ్యాయి. కశ్మీర్‌లో పాఠశాలలు, కళాశాలలు, పలు కార్యాలయాలు ఇంకా తెరుచుకోలేదు.