: లేడీస్ హాస్ట‌ళ్లలో సెల్‌ఫోన్లు చోరీ చేసి, అమ్మాయిల‌తో అస‌భ్యంగా మాట్లాడుతున్న యువకుడి అరెస్ట్


హైద‌రాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో లేడీస్ హాస్ట‌ళ్ల‌లోకి చొర‌బ‌డి సెల్‌ఫోన్లు చోరీ చేస్తోన్న ఓ యువ‌కుడిని పోలీసులు ఈరోజు ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకున్నారు. సంతోష్ అనే యువ‌కుడు ఈ చోరీల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని పోలీసులు పేర్కొన్నారు. సెల్‌ఫోన్లు చోరీ చేయ‌డ‌మే కాకుండా ఆ ఫోన్ల‌లో ఉన్న అమ్మాయిల నంబ‌ర్ల‌కు ఫోనుచేసి సంతోష్‌ అస‌భ్యంగా మాట్లాడేవాడ‌ని తెలిపారు. నిందితుడి నుంచి మొత్తం ఎనిమిది సెల్‌ఫోన్ల‌ను తాము స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు సంతోష్‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

  • Loading...

More Telugu News