: చంద్రబాబుకు మొట్టికాయలు వేసే రోజు త్వరలోనే వస్తుంది!: వైఎస్ జగన్
నేటి ఉదయం విజయవాడలోని పున్నమి ఘాట్ లో పుష్కర స్నానం చేసిన జగన్... అక్కడే మీడియాతో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్కారు చేసిన పుష్కర ఏర్పాట్లన్నింటినీ ఆయన ఓటు బ్యాంకు రాజకీయాలుగా అభివర్ణించారు. పుష్కర ఏర్పాట్ల పేరిట గుళ్లు, గోపురాలు, నేతల విగ్రహాలను ప్రభుత్వం తొలగించిందని ఆయన మండిపడ్డారు. సదావర్తి సత్రం భూములను బినామీలకు కట్టబెట్టారని విమర్శించారు. ఈ తరహా చర్యలు చేపడుతున్న చంద్రబాబుకు మొట్టికాయలు వేసే రోజు త్వరలోనే వస్తుందని కూడా జగన్ వ్యాఖ్యానించారు.