: ఏపీకి ఆర్థిక సాయం!... రూ.1,976 కోట్లు విడుదల చేసిన కేంద్రం!


ప్రత్యేక హోదా కోసం ఏపీ సర్కారు పట్టుబడుతుంటే... అందుకు ససేమిరా అంటున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత తరుణంలో ఏ మాత్రం తప్పటడుగు వేసినా పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని గమనించిన కేంద్రం... ఏపీ సర్కారును ప్రసన్నం చేసుకునేందుకు తనదైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీకి వివిధ పద్దుల కింద నిధులను విడుదల చేస్తూ కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ విడతలో రూ.1,976 కోట్లను విడుదల చేసిన కేంద్రం... వాటిలో ఏఏ పనులకు ఎంత మొత్తాన్ని విడుదల చేస్తున్నామన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. తాజాగా విడుదలైన నిధుల్లో ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చిన కేంద్రం... అందుకోసం రూ.1,176 కోట్లను కేటాయించింది. ఇక నవ్యాంద్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి గాను రూ.450 కోట్లను విడుదల చేసిన కేంద్రం... వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ.350 కోట్లను విడుదల చేసింది.

  • Loading...

More Telugu News