: ఢిల్లీలో బీజేపీకి కొత్త కార్యాలయం!... భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మోదీ!


‘జన సంఘ్’గా పురుడు పోసుకుని భారతీయ జనతా పార్టీగా పేరు మార్చుకున్న కమల దళానికి దేశ రాజధాని ఢిల్లీలో ఓ కార్యాలయం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి సదరు కార్యాలయంలోనే పార్టీ కార్యకలాపాలు సాగుతున్నాయి. చిన్న కాలువలా ప్రస్థానం మొదలుపెట్టిన బీజేపీ ఆ తర్వాత దేశంలోనే కాంగ్రెస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే స్థితికి చేరుకుంది. ఇంకా చెప్పాలంటే గడచిన మూడు దశాబ్దాల దేశ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ బీజేపీ... కేంద్రంలో స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కాలక్రమంలో ఘన విజయాలు సాధిస్తూ వస్తున్న బీజేపీకి అదే స్థాయిలో కార్యకర్తల బలం కూడా పెరిగింది. అందుకేనేమో, ఆ పార్టీ అధిష్ఠానం ఢిల్లీలో కొత్త కార్యాలయానికి రూపకల్పన చేసింది. కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కొత్త కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News