: సాక్షి మాలిక్ కు చంద్రబాబు గ్రీటింగ్స్!
రియో ఒలింపిక్స్ లో భారత పతకాల ఖాతా తెరచిన మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మహిళా రెజ్లింగ్ 58 కిలోల ఫ్రీ స్లయిల్ పోటీలో కిర్గిజిస్థాన్ కు చెందిన ఐసులు టినిబెకోవాపై 8-5 తేడాతో గెలిచిన మాలిక్... రియోలో భారత్ తరఫున తొలి పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు. కొద్దసేపటి క్రితం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా మాలిక్ ను అభినందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.