: ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. కుస్తీలో పతకం తెచ్చిన సాక్షి మాలిక్
కోట్లాదిమంది భారతీయుల ఎదురుచూపులు ఫలించాయి. ఒక్క పతకం కోసం రియోవైపు ఆశగా చూస్తున్న క్రీడాభిమానుల కోరిక నెరవేరింది. కుస్తీ (రెజ్లంగ్)లో భారత అమ్మాయి సాక్షి మాలిక్ పట్టుకు కంచు పతకం చిక్కింది. మహిళల రెజ్లింగ్ 58 కిలోల విభాగంలో కిర్గిజిస్థాన్‌కు చెందిన ఐసులు టినిబెకోవాపై 8-5 తేడాతో విజయ దుందుభి మోగించి వినువీధుల్లో భారత పతకాన్ని రెపరెపలాడించింది. ఒక దశలో 0-5తో వెనుకబడిన సాక్షి తర్వాత ఒక్కసారిగా జూలు విదిల్చి ప్రత్యర్థిని మట్టికరిపించింది. రోహ్‌తక్‌కు చెందిన 23 ఏళ్ల సాక్షి మాలిక్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్యం తెచ్చిన నాలుగో మహిళగా రికార్డులకెక్కింది. 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లేశ్వరి, 2012 లండన్ ఒలింపిక్స్‌లో బాక్సర్ మేరీ కోమ్, అదే ఒలింపిక్స్‌లో హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టారు.